బెజవాడ బఫూన్ లగడపాటి: అంబటి రాంబాబు

దమ్ముంటే లగడపాటి తన మంత్రి పదవికి రాజీనామా చేసి వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తపై పోటీ చేసి గెలవాలని అంబటి సవాల్ విసిరారు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎలాంటిదో మున్ముందు తెలుస్తుందన్నారు. బెజవాడ ప్రజలు లగడపాటికి బుద్ధి చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు. డబ్బు మదంతోనే లగడపాటి ఇష్టమొచ్చినట్లు పేలుతున్నారని ఆయన మండిపడ్డారు. వైఎస్ రాజశేఖరరెడ్డి పాదయాత్రను అపవిత్రం చేయటానికి లగడపాటి యత్నించారని అంబటి అన్నారు. పాదయాత్ర సమయంలో ఏసీ వ్యానులో విశ్రాంతి తీసుకున్న వ్యక్తికి వైఎస్ పాదయాత్ర గురించి మాట్లాడే చిత్తశుద్ది లేదన్నారు. పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు లగడపాటి ఎక్కడ ఉన్నారని ఆయన ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications