బాబు వద్ద మాట్లాడే ధైర్యం లేదా?: ఎర్రబెల్లికి గద్దర్ క్లాస్

తెలంగాణపై ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు వైఖరిని సైతం గద్దర్ తప్పుపట్టినట్లుగా తెలుస్తోంది. తెలంగాణపై చంద్రబాబు వైఖరి స్పష్టంగా తెలియజేయాల్సిందేనని గద్దర్ ఎర్రబెల్లికి సూచించినట్లుగా తెలుస్తోంది. తెలంగాణపై చంద్రబాబును అడిగే ధైర్యం మీకు లేకుంటే మేం మీకు సహాయంగా వస్తామని అందరం కలిసి అడుగుదామని సూచించినట్లుగా తెలుస్తోంది. చంద్రబాబు మౌనం అర్థం లేని విధంగా ఉందని ఆయన అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. కాగా గద్దర్ ప్రశ్నలకు సమాధానంగా పార్టీల జెండాలు పక్కన పెట్టి అందరు పోరాడటానికి సిద్ధమంటే తాము సిద్ధమని, తెలంగాణ కోసం తమ పోరు ఆగదని వివరణ ఇచ్చుకున్నట్లుగా తెలుస్తోంది.












Click it and Unblock the Notifications