కూతురిపై తండ్రి లైంగిక వేధింపులు, 14 ఏళ్ల జైలు శిక్ష

తనకు ఆరు సంవత్సరాల వయస్సు ఉన్నప్పటి నుంచి అతడు తన పై అత్యాచారం ప్రారంభించాడని, తనకు 15 ఏళ్ల వయస్సు వచ్చేంత వరకు తనపై అఘాయిత్యాలు కొనసాగిస్తూ వచ్చాడని తన ఫిర్యాదులో పేర్కొంది. ఇలాంటి కేసులకు సంబంధించి పేరు వెల్లడించడకుండా ఉండేందుకు బాధితులకు ఉన్న హక్కును టీనా స్వచ్ఛందంగా వదులుకుంది. ఇలాంటి ఘటనలు తెలుసుకున్న తరవాతనైనా మరి కొందరు బాధితులు తమకు జరిగిన అత్యాచారల పై ధైర్యంగా ఫిర్యాదు చేసేందుకు ముందుకు వస్తారని భావిస్తున్నట్లు ఆమె పేర్కొంది. తాను చేస్తున్న కోర్సులో భాగంగా లైంగిక నేరాల చట్టంలోని నిబంధనలు తెలుసుకుని, పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు టీనా తెలిపింది. కేసును విచారించిన సౌతెండ్ క్రౌన్ న్యాయస్థానం టీనా సవతి తండ్రి డేవిడ్ మూరేకు పద్నాలుగేళ్ల జైలు శిక్షను విధిస్తూ తీర్పునిచ్చింది.












Click it and Unblock the Notifications