బాంబులు పెట్టేందుకు మీరట్ వ్యక్తికి రెండు కోట్లు?

Uttar Pradesh
లక్నో : మీరట్‌లో మాంసం అమ్మేఒక వ్యాపారికి నగరంలో అల్లర్లు, పేలుళ్ళు నిర్వహిస్తే సొమ్ము ఇస్తామంటూ ఇరాన్ నుండి ఒక మిస్టరీ ఫోన్ కాల్ వచ్చింద. దీని దర్యాప్తుకు ఉత్తర ప్రదేశ్ పోలీసులు స్పెషల్ టాస్క్ ఫోర్సు పోలీసులకు ఆదేశాలు జారీ చేశారని ఒక సీనియర్ పోలీస్ అధికారి తెలిపారు. వివరాల్లోకి వెళితే, మీరట్ నగరంలోని హాషిం ఇలాహి ఇస్మాయిల్ నగర్ లో మాంసం వ్యాపారాన్ని చేస్తుంటాడు. జూలై 13వ తేదీ రాత్రి ఇరాన్ నుండి తనకు నగరంలో బాంబులు పెడితే లేదా అల్లర్లు సృష్టిస్తే సొమ్ము ఇస్తామంటూ మూడు ఫోన్ కాల్స్ వచ్చాయని చెపుతూ తన వద్దకు వచ్చినట్లు స్పెషల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ బ్రిజ్ లాల్ విలేఖర్లకు తెలియజేశారు.

ఫోన్ చేసిన వ్యక్తులు నగరంలో అల్లర్లు, పేలుళ్ళు నిర్వహిస్తే రెండు కోట్ల రూపాయలు ముట్టచెపుతామని తెలిపినట్లుగా కూడా ఇలాహి తెలిపినట్లు ఆయన చెప్పారు. తనను మూడు ఫోన్ నెంబర్లనుండి సంప్రదించారని, ఆ నెంబర్లు +9837173840, +3444050, + 7868970150గా వున్నాయని వ్యాపారి తెలిపాడు. ఆయన మొబైల్ లో ఇస్లాం మతం శుభంగా భావించే 786 అంకెలు వుండటం చేత వారు ఈ ఘాతుక చర్యలకు ఈ వ్యాపారిని ఎంపిక చేసుకున్నట్లు ఒక వార్తా పత్రిక తెలిపింది.

ఇరాన్ నుండి వచ్చిన ఈ ఫోన్ కాల్స్ ఇండియాలోకి అమెరికా ద్వారా వచ్చాయని, వ్యాపారి ఒక ప్రయివేట్ ఆపరేటర్ ద్వారా వాటిని తీసుకోడం జరిగిందని ప్రాధమిక దర్యాప్తులో వెల్లడైనట్లు పోలీసులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+