సోనియా నా వెన్ను, కాళ్లు విరిచేలా ఉన్నారు: జగన్

సిబిఐని కాంగ్రెసు బ్యూరో అన్న తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తనపై సిబిఐ విచారణ కోరడం సిగ్గుచేటు అని ఆయన అన్నారు. కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీల తీరును తనను బాధిస్తోందని ఆయన అన్నారు. రెండుసార్లు కాంగ్రెసు పార్టీ వైయస్సార్ వల్లనే గెలిచిందని ఆయన అన్నారు. కొన్ని మీడియా సంస్థలు పనిగట్టుకుని తనపై దుష్ప్రచారం చేస్తున్నాయని ఆయన అన్నారు. తనను అప్రతిష్టపాలు చేయడానికే మంత్రి శంకరరావుతో పిటిషన్ వేయించారని ఆయన విమర్శించారు. సోనియా గాంధీ ఢిల్లీలో రాజ్యమేలుతున్నారంటే అది వైయస్సార్ పుణ్యమేనని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications