వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ఒకే వేదిక మీదికి ఇరు ప్రాంతాల నేతలు: బొత్స

చర్చల ద్వారానే సమస్య పరిష్కారమవుతుందని ఆయన అన్నారు. తెలంగాణ, సీమాంధ్ర నాయకులు విడివిడిగా ఎవరి మనోభావాలను వారు వ్యక్తీకరిస్తున్నారని, ఎదుటి వారి మనోభావాలను పట్టించుకోవడం లేదని, అందువల్ల ఇరు ప్రాంతాల నాయకులు ఒకే వేదిక మీదికి వస్తే పరస్పర అవగాహనకు అవకాశం కలుగుతుందని, తద్వారా పరిష్కార మార్గాన్ని కేంద్ర ప్రభుత్వానికీ పార్టీ అధిష్టానానికీ విన్నవించడానికి వీలవుతుందని ఆయన అన్నారు. తాను తెలంగాణ నాయకులతో, సీమాంధ్ర నాయకులతో జరిపిన చర్చలు వివరాలను ఆజాద్‌కు వివరించానని, తాజా పరిస్థితులను కూడా చెప్పానని ఆయన అన్నారు. పార్టీలో ఏకాభిప్రాయం కుదిరిన తర్వాత ఇతర పార్టీల గురించి ఆలోచిస్తామని ఆయన అన్నారు. నిర్ణయం తీసుకోవాల్సింది యుపిఎ ప్రభుత్వమేనని ఆయన అన్నారు. రాజీనామాలపై ఆ ప్రాంత ప్రజాప్రతినిధులు ఆలోచించుకుని, నిర్ణయం తీసుకుంటారని ఆయన అన్నారు.