హైదరాబాద్ : సత్యసాయి ట్రస్ట్ సమర్పించిన నివేదికలోని వివరణ పత్రాల పరిశీలన ముగిసింది. ప్రభుత్వం ఏర్పాటుచేసిన ముగ్గురు సభ్యుల కమిటీ ట్రస్టు సమర్పించిన వివరాలను వారంపాటు అధ్యయనం చేసి దేవాదాయశాఖ ముఖ్య కార్యదర్శి రమణాచారికి నివేదిక సమర్పించినట్లు సమాచారం. అయితే దీన్ని అధ్యయనం చేసిన తరువాత కూడా ప్రభుత్వం ట్రస్టు వ్యవహారాలపై ఓ అంచనాకు రాలేకపోతున్నట్లు తెలుస్తోంది. దీంతో ఆ నివేదికను దేవాదాయశాఖ అధికారులు మరోమారు అధ్యయనం చేసి తుదిరూపు ఇచ్చాక ముఖ్యమంత్రికి అందజేయనున్నారు. ఇందుకు మరికొంత సమయం పడుతుందని అధికారులు తెలిపారు.
The three member committee appointed by the Government studied the sai trust reports and submitted the same to endowments Principal secretary Ramanachari. Though the Government studied the reports it could not have any conclusion on trust affairs.
Story first published: Thursday, July 21, 2011, 16:25 [IST]