వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జైపాల్ రెడ్డి రాజీనామా చేయాలి: కోమటిరెడ్డి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Komatireddy Venkat Reddy
నల్గొండ/న్యూఢిల్లీ: కేంద్ర పెట్రోలియం శాఖా మంత్రి వెంటనే రాజీనామా చేయాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి గురువారం నల్గొండ జిల్లాలో విలేకరులతో మాట్లాడుతూ డిమాండ్ చేశారు. బుధవారం న్యూఢిల్లీలోని పార్లమెంటు సమీపంలోని పార్కులో తెలంగాణ సాధన కోసం ఆత్మహత్య చేసుకున్న యాదిరెడ్డి మృతికి నైతిక బాధ్యత వహిస్తూ జైపాల్ రెడ్డి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో జరుగుతున్న విద్యార్థుల ఆత్మహత్యలు అన్నీ సీమాంధ్ర నేతల ఆత్మహత్యలే అన్నారు. తెలుగుదేశం పార్టీ తెలంగాణ ఫోరం నేతలు చంద్రబాబుతో లేఖ ఇప్పిస్తే వారం రోజుల్లో తెలంగాణ తీసుకు వస్తామని చెప్పారు.

కాగా న్యూఢిల్లీ వెళ్లిన తెలంగాణ ప్రజాప్రతినిధులు రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రిలోని యాదిరెడ్డి మృతదేహానికి నివాళులు అర్పించారు. ఎంపీలు పొన్నం ప్రభాకర్, కె కేశవరావు, మందా జగన్నాథం, రాజయ్య, వి హనుమంతరావు, మంత్రి జానారెడ్డి తదితరులు ఉన్నారు. కాగా సాయంత్రం యాదిరెడ్డి మృతదేహాన్ని హైదరాబాదు తీసుకు రానున్నారు.

English summary
Minister Komatireddy Venkat Reddy demanded today that Union minister Jaipal Reddy resignation.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X