వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆ బాలుడి కాళ్లకు, వేళ్లకు 34 వేళ్లు: గిన్నిస్ రికార్డు

|
Google Oneindia TeluguNews

Bareilly Baby Boy
బరేలి (ఉత్తర్ ప్రదేశ్) : ఆ బుడతడి వయస్సు చూస్తే ఏడాది.. గిన్నీస్ ప్రపంచ రికార్డుల్లో మాత్రం ఘనాపాటి.. ఎందుకని అంటారా మనోడికి మొత్తం 34 వేళ్లు (చేతులు, కాళ్లతో కలుపుకుని). ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రం బరేలీ ప్రాంతానికి అక్షత్ ఈ రికార్డును సొంతం చేసుకున్నాడు. తన బిడ్డ అక్షత్ ఇంతటి రికార్డును సాధించటం తనకు సక్యంగా లేదని తల్లి అమృత సెక్సేనా వాపోతుంది. తమ కుటుంబానికి సమీప బంధువైన ఒకరు ఇంటర్నెట్ లో సెర్చ్ చేస్తుండగా 31 వేళ్లతో ఉన్న చైనా బాబు రికార్డును చూసి. ఆ సమాచారాన్ని అమృత్ కుటుంబ సభ్యులకు అందించారు.

అయితే 34 వేళ్లు ఉండటంతో వెంటనే ఆ బాలుడి కుటుంబ సభ్యులు బాబుకు సంబంధించిన వివరాలతో పాటు ఫోటో గ్రాఫ్ లను ఇంటర్నెట్ లో పొందుపరిచారు. అయితే తమ బాబు పేరు గన్నీస్ రికార్డుల్లో నమోదు చేసేందుకు సంబంధిత డాక్యుమెంట్లతో కూడిన సమాచారాన్ని గిన్నీస్ ప్రపంచ రికార్డు సభ్యులకు అందించామని సెక్సేనా తెలిపింది. అక్షిత్ ను పరీక్షించిన వైద్యులు జన్యుసంబంధిత లోపాల కారణంగా ఇలాంటి సంఘటనలు అరుదుగాచోటుచేసుకుంటాయని చెప్పారు. ఎముకులు ఎదుగుల పై మెడిసెన్ ల ప్రభావం అతిగా చూపటం వల్ల వాటి ఎదుగుదలలో మార్పులు వస్తాయని గైనాకాలజిస్ట్ డాక్టర్ పాల్ గుప్తా పేర్కొన్నారు.

శస్త్ర చికిత్స సాయంతో ఎక్కువుగా ఉన్న వేళ్లను తొలగించవచ్చని, కొన్ని సందర్భాల్లో ఆపరేషన్ చేయకుండానే ఇటువంటి సమస్యలను నిర్మూలించవచ్చని, ముఖ్యంగా ఇలాంటి సమస్యలు ఎదురైనప్పుడు ఎక్కువ శాతం మంది ప్లాస్టిక్ సర్జరీ చేయించుకునేందుకు ఇష్టతు చూపుతున్నారని వెల్లడించిన గుప్తా, అక్షత్ విషయంలో అతని తల్లి దండ్రులు ఏ మాత్రం ఆందోళణ చెందనవసరం లేదని, చికిత్స ద్వారా అక్షిత చేతులు, కాళ్లు సాధారణ స్థితికి వస్తాయన్నారు. జన్యు సంబంధిత లోపాల కారణంగా చోటుచేసుకునే ఈ పరిణామాలు మనుషుల్లోనే కాకుండా కుక్కలు, పిల్లులో కూడా వ్యాప్తి చెందుతాయని వైద్యులు వెల్లడించారు.

English summary
Akshath, a baby boy over the age of one, registered his name in the Guinness world records for having a total of 34 fingers and toes. He has set the record for having the highest number of fingers and toes and hails from the Bareilly district in Uttar Pradesh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X