డ్రగ్స్ కేసులో హీరోలు వరుణ్ సందేశ్, అభిషేక్?

వరుణ్ సందేశ్, అభిషేక్, నిర్మాత ఉప్పలపాటి రవితో పాటు మరి కొంత మంది సినీ ప్రముఖులకు డ్రగ్స్ సరఫరా చేసినట్లు నాగసిద్ధార్థ పోలీసుల విచారణలో చెప్పినట్లు తెలుస్తోంది. ఈ కేసులో మరో ఇద్దరిని కూడా అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. వారిద్దరి పేర్లు బయటకు రావడం లేదు. అభిషేక్ డేంజర్, నేను సినిమాల్లో హీరోగా నటించాడు. ఫ్రెడరిక్, నాగసిద్ధార్థలు హైదరాబాదు నగరానికి 250 గ్రాముల కొకైన్ తెచ్చినట్లు తెలుస్తోంది. సిద్ధార్థ కాల్ లెటర్‌ను పోలీసులు పరిశీలిస్తున్నారు. వరుణ్ సందేశ్ మరో చరిత్ర, కొత్త బంగారు లోకం, మరో చరిత్ర, ఏమైంది ఈ వేళ అనే సినిమాల్లో నటించాడు. ఐదేళ్ల క్రితం చదవడానికి సిద్ధార్థ బెంగళూర్ వెళ్లాడు. అప్పటి నుంచి సిద్ధార్థతో పాటు వరుణ్ సందేశ్, అభిషేక్ వారాంతాల్లో డ్రగ్స్‌తో పార్టీలు చేసుకుంటున్నట్లు నాగసిద్ధార్థ చెప్పినట్లు తెలుస్తోంది. ఈ పార్టీలకు ఇతర సినీ ప్రముఖులను కూడా ఆహ్వానిస్తామని ఆయన చెప్పినట్లు సమాచారం.
ఫ్రెడరిక్ తన పేరు చెప్పినట్లు వచ్చిన వార్తలను వరుణ్ సందేశ్ ఖండించారు. తనను పోలీసులు అరెస్టు చేసినట్లు వచ్చిన వార్తలపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. చాలా మంది మిత్రులున్నారని, వాళ్ల చరిత్ర తనకు తెలియదని ఆయన అన్నారు. సిద్ధార్థ తనకు తెలుసునని ఆయన అన్నారు. సిద్ధార్థతో తనకు అంత సాన్నిహిత్యం లేదని ఆయన అన్నారు. తాను డ్యాన్స్ ప్రాక్టీసులో ఉన్నానని, అరెస్టు అయితే ఇక్కడ ఎలా ఉంటానని ఆయన అన్నారు. పోలీసులు తనను సంప్రదించలేదని ఆయన ఓ టీవీ చానెల్ ప్రతినిధితో అన్నారు. ఫ్రెడరిక్ వద్ద మీ ఫోన్ నెంబర్ ఎలా ఉందని అడిగితే తన ఫోన్ నెంబర్ ఉండడానికి వీల్లేదని అంటూనే తన ఫోన్ నెంబర్ చాలా మంది వద్ద ఉంటుందని సమాధానమిచ్చారు. నిజమో, కాదో తెలుసుకుని వార్తలు ఇవ్వాల్సి ఉంటుందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications