హీరోలు మోహన్‌లాల్, మమ్మూట్టీ ఇళ్లపై ఐటి దాడులు

మోహన్‌లాల్, మమ్మూట్టీలు చూపించిన ఆదాయానికి, వారి సంపాదనకు మధ్య పొంతన లేదని సమాచారం అందడంతో ఐటి అధికారులు సోదాలు చేస్తున్నారు. చెన్నైలోని మమ్మూట్టీ ప్రొడక్షన్ కంపెనీ ప్లే హౌస్ కార్యాలయంలో, చెన్నై, కొచ్చిల్లోని ఇళ్లలో సోదాలు జరుగుతున్నాయి.
మోహన్‌లాల్ ప్రొడక్షన్, పంపిణీ కార్యాలయాలు మాక్స్ ల్యాబ్స్, అశీర్వాద్ హౌస్‌ల్లో ఐటి అధికారులు సోదాలు చేస్తున్నారు. మొహన్‌లాల్‌కు చెందిన ఫిల్మ్ స్టూడియో విస్మయ సినీమాక్స్‌లో కూడా సోదాలు నిర్వహిస్తున్నారు. త్రివేండ్రంలో మోహన్‌లాల్ తల్లి నివసిస్తున్న ఇంటిపై కూడా ఐటి అధికారులు దాడులు చేశారు. ఆయనకు బెంగళూర్‌లో హోటళ్లున్నాయి. ఇటీవలే ఆయన దుబాయ్‌లోని ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన టవర్‌లో ప్లుష్ హౌస్ కొన్నారు. ఈ సోదాలు జరుగుతున్న సమయంలో రామేశ్వరంలో సినిమా షూటింగులో ఉండగా, మమ్మూట్టీ చెన్నైలో ఉన్నారు.












Click it and Unblock the Notifications