దిగొచ్చిన తెలంగాణ నేతలు: ఆజాద్‌తో చర్చలు

కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ గులాం నబీ ఆజాద్‌కు తెలంగాణ ప్రజాప్రతినిధులు అంతకు ముందు మరోసారి ఝలక్ ఇచ్చారు. ఢిల్లీకి వచ్చిన తెలంగాణ నేతలు ఆజాద్‌తో చర్చలు జరపకూడదని తొలుత నిర్ణయించుకున్నారు. తెలంగాణ సీనియర్ నేత కె. కేశవ రావు నివాసంలో సమావేశమైన తెలంగాణ నేతలు తెలంగాణపై స్పష్టమైన వైఖరి వెల్లడించకుండా ఆజాద్‌తో చర్చలు జరిపేది లేదని తేల్చి చెప్పారు. ఈ విషయం చెప్పడానికి కేశవరావును, మంత్రి కె. జానారెడ్డి ఆజాద్ వద్దకు మధ్యవర్తులుగా వెళ్లారు. చివరకు ఆజాద్ అందరినీ ఆహ్వానించడంతో సమస్య పరిష్కారమైంది.
రాజీనామాలు ముఖ్యం కాదు, అభివృద్ధే ముఖ్యమని ప్రకటించిన ఆజాద్‌తో చర్చలు జరిపేది లేదని వారంటున్నారు. పది మందితోనే చర్చలు జరపుతామనే ఆజాద్ ప్రకటనను కూడా వారు తప్పు పడుతున్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సిద్ధమని ప్రకటించి, దాని కోసం చర్చలకైతేనే తాము వస్తామని వారంటున్నారు. ఆజాద్ ఎజెండా స్పష్టమైన తర్వాత ఇక చర్చలు జరిపి ప్రయోజనమేమిటని వారడుగుతున్నారు. తెలంగాణ అంశం ఎజెండాలో లేకపోతే చర్చలు జరిపేది లేదని వారు చెబుతున్నారు. తెలంగాణ ఏర్పాటు దిశగా మాత్రమే చర్చలుండాలని వారంటున్నారు. అందుకు అనుగుణంగా ఎజెండా ప్రకటిస్తేనే తాము చర్చలు జరుపుతామని వారంటున్నారు. అయితే ఆజాద్ నచ్చజెప్పడంతో వారు తమ మనసు మార్చుకున్నారు.












Click it and Unblock the Notifications