హీరో వరుణ్ సందేశ్‌కు పాలిగ్రాఫ్ పరీక్ష?

నాగ సిద్ధార్థ మాట మార్చిన నేపథ్యంలో పోలీసులు వరుణ్ సందేశ్‌కు పాలిగ్రాఫ్ పరీక్ష చేయనున్నారు. ఇందుకు గాను తాము కోర్టు అనుమతి తీసుకున్నట్లు వారు తెలిపారు. నాగ సిద్ధార్థ, వరుణ్ సందేశ్‌ల ఫోన్ కాల్స్ పరిశీలిస్తామని, ఆ తర్వాత వరుణ్ సందేశ్‌ను విచారిస్తామని వారంటున్నారు. ఈ కేసు మంగళవారం ముందుకు వస్తుందని కూడా అంటున్నారు. నాగ సిద్ధార్థ ఫోన్ కాల్స్ ఆధారంగా సినీ పరిశ్రమకు చెందినవారు ఎవరెవరు ఈ డ్రగ్ రాకెట్లో ఉన్నారనే విషయంపై ఆరా తీయడానికి కూడా పోలీసులు ప్రయత్నిస్తున్నారు.












Click it and Unblock the Notifications