బిజెపి రాజనీతి: రాజకీయాస్త్రంగా కత్రినా కైఫ్

రాహుల్ గాంధీపై చేసిన వ్యాఖ్యలకు గాను కాంగ్రెసు నాయకులు కత్రినా కైఫ్‌పై తీవ్రంగా మండిపడ్డారు. రాజకీయాలను ఆ స్థాయికి దిగజార్చవద్దని వారు సలహా ఇచ్చారు. దీంతో కత్రినా కైఫ్ క్షమాపణలు చెప్పింది. ఆమె క్షమాపణలు చెప్పినప్పటికీ విదేశీయతను మళ్లీ తెర మీదికి తెచ్చిన కత్రినా వ్యాఖ్యల వేడి తగ్గబోదని, ఆ వ్యాఖ్యలు చేసిన కత్రినా కైఫ్ ప్రజలను ఆకట్టుకోగలుగుతారని బిజెపి నాయకులు ఆశపడుతున్నారు. కత్రినా కైఫ్ మద్దతు కోసం ప్రయత్నిస్తున్నామని బిజెపి నగర చీఫ్ రాజ్ కె. పురోహిత్ అంటున్నారు. బహిరంగంగా ఆ విధమైన ప్రకటన చేసిన వ్యక్తి కత్రినా కైఫ్ మాత్రమేనని, ఆమె మాటల్లో అబద్ధం లేదని చెబుతున్నారు. రాజనీతి సినిమాలో సోనియా గాంధీని కత్రినా కైఫ్ అనుకరించింది. బిజెపిలో చేరితే ఆమె ప్రజల ముందుకు అదే గెటప్‌లో రావచ్చునని కూడా భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications