హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జైలుకు కాదు ఉరికంబం ఎక్కడానికి సిద్ధం: కెటిఆర్

By Srinivas
|
Google Oneindia TeluguNews

KT Rama Rao
హైదరాబాద్: కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం రాజీనామా చేయకుంటే చరిత్రహీనుడు అవుతాడని తెలంగాణ రాష్ట్ర సమితి సిరిసిల్ల శాసనసభ్యుడు కల్వకుంట్ల తారక రామారావు సోమవారం అన్నారు. జైపాల్ రెడ్డి వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. చేవెళ్ల నియోజకవర్గానికి చెందిన యువకుడు తెలంగాణ కోసం ఆత్మత్యాగం చేసుకుంటే జైపాల్ రెడ్డి కనీసం పరామర్శించక పోవడం శోచనీయం అన్నారు. జైపాల్ రెడ్డి నియోజకవర్గం వ్యక్తిని అయినందుకు సిగ్గుపడుతున్నానని యాదిరెడ్డి తన సూసైడ్ నోట్‌లో పేర్కొన్న విషయాన్ని గుర్తు చేశారు. ఈసారి జైపాల్ రెడ్డి సైతం తెలంగాణ కోసం రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

పదవులు శాశ్వతం కాదన్నారు. కేబినెట్‌కు వెంటనే రాజీనామా చేయాలన్నారు. అన్ని పార్టీల వారు తెలంగాణ కోసం రాజీనామా చేయడంతో సరిపెడితే సరిపోదన్నారు. రాజీనామాలో ఆమోదింప చేసుకోవాలని డిమాండ్ చేశారు. అవసరమైతే పార్టీలను వీడి ఉద్యమాలు చేయాలని సూచించారు. తెలంగాణపై ఒక్క అడుగు ముందుకు పడకుండానే రాజీనామాలపై వెనుకడుగు వేస్తే వారు చరిత్రహీనులుగా మిగిలి పోతారని అన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం ఆలోచించే వారు రాజీనామాలపై ఆలోచిస్తారని ఆరోపించారు. సభాపతి నాదెండ్ల మనోహర్ సీమాంధ్ర ప్రజాప్రతినిధుల చేతిలో పావుగా మారాడాని విమర్శించారు. తెలంగాణ ప్రజాప్రతినిధులు ఎవరి ఒత్తిళ్లకు లొంగి రాజీనామాలు చేయలేదని చెప్పారు.

నాదెండ్ల సైతం ఎవరి ఒత్తిళ్లకు లొంగకుండా తమ రాజీనామాలు ఆమోదించాలని సూచించారు. రాజీనామాలు చేసిన ఎమ్మెల్యేలతో మాట్లాడకుండా తిరస్కరించడం ఎంత వరకు సమంజసం అన్నారు. స్పీకర్ తీరు తమని తీవ్రంగా బాధించిందన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి జైలు వ్యాఖ్యలపై కెటిఆర్ తీవ్రంగా విరుచుకు పడ్డారు. తెలంగాణ రాష్ట్రం కోసం జైలుకు వెళ్లడమే కాదు అవసరమైతే ఉరికంబం ఎక్కడానికి కూడా సిద్ధమని చెప్పారు.

English summary
TRS mla Kiran Kumar Reddy challenges CM Kiran Kumar Reddy today.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X