‘హేపీ బర్త్ డే’ పాట పాడాడు - అయిదుగుర్ని చంపాడు!

వివరాల్లోకి వెళితే, 35 ఏళ్ళ ట్యాన్ డో తన పేంటు జేబులో వున్న గన్ ను నింపాదిగా బయటకు తీశాడు. కాల్చవలసిన వారిని గుర్తించాడు. అంతే మొదటగా తన భార్య అయిన బర్త్ డే బాయ్ తల్లిని, ఆమె పక్కనే వున్న ఆమె ఇద్దరు సోదరీ మణులను, ఆమె సోదరుడిని, అతని పక్కనే వున్న వదినను పేల్చి తనను తాను షూట్ చేసుకున్నాడని బర్త్ డే పార్టీకి హాజరైన 19 ఏళ్ళ డిస్క్ జాకీ ఎల్లెన్ టిలోట్సన్ వివరించాడు. ఈ సంఘటనలో మరో నలుగురు గాయపడ్డారు.
అంతా పధకం ప్రకారమే జరిగిందని, డబ్బు ఇబ్బందులున్న ట్యాన్ డో కు మానసిక సమస్యలు కూడా వేధిస్తుండగా అందరిని ఒకేసారి చంపాలని నిర్ణయించుకున్న ఇతను కొడుకు జన్మదిన వేడుక అవకాశంగా తీసుకున్నాడని గ్రాండ్ ప్రయిరీ పట్టణ పోలీసులు వెల్లడించారు. ట్యాన్ డో గృహ హింస కారణంగా భార్య గతంలో ఒకసారి విడాకులు కోరగా కోర్టు భర్త కొంత కాలం దూరంగా ఉండాలని ఆదేశాలు జారీ చేసిందని అయితే భార్య మరల ఆ కేసును ఉపసంహరించడంతో మరోమారు ట్యాన్ డో కుటుంబంతో కలసి వుంటున్నాడని కూడా పోలీసులు వెల్లడించారు.












Click it and Unblock the Notifications