వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ముంబై పేలుళ్లు: నేపాల్‌లో అనుమానితుడి అరెస్టు

By Pratap
|
Google Oneindia TeluguNews

Mumbai Blast
ఖాట్మండు: ముంబైలో ఈ నెల 13వ తేదీన జరిగిన మూడు వరుస పేలుళ్ల కేసులో పోలీసులు నేపాల్‌లో భారత్‌కు చెందిన ఓ వ్యక్తిని మంగళవారం అరెస్టు చేశారు. ముంబై పేలుళ్లలో పాత్ర ఉందనే అనుమానంపై అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఈ పేలుళ్లకు సంబంధించి ఇదే తొలి అరెస్టు. ఆ వ్యక్తిని నేపాల్ ఉగ్రవాద నిరోధక పోలీసులు ఖాట్మండులోని బలువతార్ ప్రాంతంలో అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.

అతను పంపిన సెల్ సందేశాలను, ఫోన్ కాల్స్‌ను పరిశీలించిన తర్వాత అతన్ని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. అవి ముంబైకి వెళ్లడంతో అనుమానిస్తున్నారు. ఈ అరెస్టు వల్ల పేలుళ్ల కేసు దర్యాప్తు ముందుకు సాగుతుందని భావిస్తున్నారు. తాను అరెస్టును ధ్రువీకరించలేనని నేపాల్ పోలీసు అధికారిక ప్రతినిధి నవరాజ్ ధకాల్ చెప్పారు. తాను అరెస్టు గురించి విన్నానని, తాను సమాచారం సేకరిస్తున్నానని, అయితే అరెస్టు జరిగిందా లేదా అనేది ఇప్పుడే చెప్పలేనని ఆయన అన్నారు.

English summary
Police in Nepal have arrested an Indian man suspected of having links to triple bomb blasts in Mumbai on July 13 that killed 24 people, a police officer told AFP on Tuesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X