• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

బాలికకు సెక్స్ టాయ్స్, అండర్ వేర్లు పంపిన ఘనుడు

By B N Sharma
|

Suraj Sagar
ముంబై: ఛార్ కోప్‌లో తన తల్లితండ్రులతో ఉంటున్న ఓ 19 ఏళ్ళ బాలికకు ఎవరు పంపుతున్నారో తెలియదు కానీ ఎన్నో రకాల గిఫ్ట్ ప్యాకెట్లు వచ్చేవి. మొదటిసారి బహుమానం ప్యాకెట్ విప్పిన బాలిక ఎంతో ఉత్సాహానికి గురైంది. కానీ, ఆ తర్వాత ఒక్కొక్కటిగా తనకు వస్తున్న బహుమానలను చూసిన ఆ బాలిక మరియు ఆమె తల్లిదండ్రులు అవాక్కవ్వండం మొదలు పెట్టారు. ఆ బాలికకు వస్తున్న బహుమతుల్లో సెక్స్ బొమ్మలు, అండర్ వేర్లు వంటివి ఉండేవి. దీంతో బాలిక తల్లితండ్రులు కలవరానికి లోనయ్యేవారు. ఆందోళన చెందిన తల్లి దండ్రులు ఈ విషయం గురించి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

బాలిక తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు ఎట్టకేలకు ఈ వస్తువులను పంపుతున్న 21 ఏళ్ళ యువకుడిని పట్టుకోగలిగారు. ఆ బాలికపై ఈ యువకుడు బాలికపై మనసు పడ్డాడట, అందుకే ఈ కానుకలు పంపించడం ప్రారంభించాడు. ఈ నిందితుడి పేరు సూరజ్ సాగర్ అని, రెండు వారాలనుండి ఆ బాలికను ఇబ్బంది పెడుతున్నాడని పోలీసులు వెల్లడించారు. అంతేకాకుండా.. యువతి ఇంటికి సమీపంలో వున్న రెస్టారెంట్ నుండి భోజన పార్శిళ్ళు పంపేవాడని, ఆ పార్శిల్ ఇంటికి వచ్చేసరికి బాలిక తండ్రి వాటి కోసం వేల రూపాయలు చెల్లించాల్సి వచ్చేదని ఛార్ కోప్ పోలీస్ స్టేషన్ అసిస్టెంట్ పోలీస్ ఇనస్పెక్టర్ ప్రమోద్ తోరాడమల్ తెలిపారు.

ఈ యువతి గతంలో తాను పోగొట్టుకున్న సెల్ ఫోన్ సాగర్‌కు దొరకడంతో అతడు దాని ద్వారా ఆమె తండ్రి ఫోన్ నెంబర్ తెలుసుకొని దుర్వినియోగం చేశాడని, సెల్ ఫోన్‌లో బాలిక తండ్రిని అసభ్య పదజాలం ఉపయోగిస్తూ తిట్లు తిట్టటమే కాకుండా ఎస్ఎమ్ఎస్‌లు కూడా పంపేవాడని పోలీసులు తెలిపారు. ఆ బాలిక ఇతర స్నేహితుల తెలిసిన దాని ప్రకారం నిందితుడు ఆమెకు ఒక కామన్ ఫ్రెండ్ అని తెలిసింది.

ఈ యువకుడు భాలిక నివసిస్తున్న ఇంటి సమీపంలోనే వుండేవాడు. బాలిక కదలికలు, పోలీసుల దర్యాప్తు మొదలైన చర్యలు అదే ప్రదేశంలో వున్నమరో 17 ఏళ్ళ బాలుడి ద్వారా తెలుసుకుంటుండేవాడు. ఈ బాలుడికి పోలీసులకు ఫిర్యాదు చేసిన యువతే కాక, ఆమె స్నేహితురాలు కూడా పరిచయం వుంది. ఆమె కూడా మైనరే. నేరంలో జోక్యంకల ముగ్గురిపై పోలీసులు సంబంధిత సెక్షన్ల క్రింద కేసులు పెట్టి అరెస్టు చేశారు. చివరకు పోలీసులు ఇద్దరు మైనర్లను పిల్లల రిమాండు హౌస్ కు, మేజర్ అయిన సాగర్ను కోర్టులో హాజరు పరచటానికి నిర్ణయించినట్లు తెలిపారు.

English summary
"We have arrested all the three involved in the crime under Section 509 (for word, gesture or act intended to insult the modesty of a woman) and Section 504 (for intentional insult with intent to provoke breach of peace) and Section 34 of the Indian Penal Code. As two of them are minors, they have been sent to the children's remand home. Sagar would be presented in court tomorrow," said Toradmal.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X