బొత్స సత్యనారాయణకు చిక్కులు, క్షమాపణ

Botsa Satyanarayana
హైదరాబాద్: త్రిశూల్ అనే పుస్తకం ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ (పిసిసి) అధ్యక్షుడు బొత్స సత్యనారాయణను చిక్కులో పడేసింది. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని అవమానిస్తూ బొత్స సత్యనారాయణను పైకి లేపుతూ ఆ పుస్తకంలో ఓ చిత్రం ప్రచురితమైంది. వామనావతారంలో ఉన్న బొత్స సత్యనారాయణ ఓ కాలును మంత్రివర్గంపై, మరో కాలును పిసిసి కుర్చీపై, మూడో కాలును బలిచక్రవర్తి రూపంలో ఉన్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై పెట్టినట్లుగా ఆ చిత్రం ముద్రితమైంది. ఆ పుస్తకంలో కాంగ్రెసు వాణిజ్యప్రకటనలు బోలెడున్నాయి. పైగా ఆ పుస్తకాన్ని బొత్స సత్యనారాయణ అవిష్కరించారు. ఆ పుస్తకం మార్కెట్లోకి వచ్చిన తర్వాత చిత్రం చర్చనీయాంశంగా మారింది. ఈ స్థితిలో బొత్స సత్యనారాయణ క్షమాపణలు చెప్పారు.

పుస్తకంలో ప్రచురించిన అనుచిత చిత్రాలకు బొత్స సత్యనారాయణ బుధవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో క్షమాపణలు చెప్పారు. ఇలాంటి చిత్రాలు ప్రచురించడం సంప్రదాయం కాదని ఆయన అన్నారు. మనోభావాలు దెబ్బ తినే విధంగా ఆ చిత్రాలు ఉన్నాయని, అటువంటి చిత్రాలు ప్రచురించడం మంచిది కాదని ఆయన అన్నారు. తెలంగాణ, సీమాంధ్ర ప్రాంతాల నాయకులు పరస్పరం రెచ్చగొట్టే ప్రకటనలు మానుకోవాలని ఆయన సూచించారు. ఢిల్లీ చర్చల్లో పాల్గొనాలని తాను సీమాంధ్ర నాయకులకు సూచించినట్లు ఆయన తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+