టిఆర్ఎస్‌తో కలిసి వెళతాం: ఎర్రబెల్లి దయాకర రావు

తెలంగాణ రాష్ట్రంపై కేంద్ర మంత్రులలోనే ముందు ఏకాభిప్రాయం లేదని ఆయన ఆరోపించారు. చిదంబరం, గులాం నబీ ఆజాద్, ప్రణబ్ ముఖర్జీ నిత్యం మాటలు మారుస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెసు పార్టీలో ఏకాభిప్రాయం వస్తే తెలంగణ వెంటనే వస్తుందన్నారు. కేంద్రం తెలంగాణ ప్రజలను మోసం చేస్తుందన్నారు. విద్యార్థులపై కేసులు ఎత్తి వేస్తామని చెప్పి ఇప్పటి వరకు ఎత్తివేయలేదని ప్రశ్నించారు. తెలంగాణపై ఢిల్లీలో కాకుండా హైదరాబాదులో ప్రకటించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రం ఇస్తారో ఇవ్వరో తేల్చాలన్నారు. కేంద్ర మంత్రి చిదంబరం డిసెంబర్ 9 ప్రకటనకు కట్టుబడి ఉండాలని లేకుంటే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ప్రజా కోర్టులో కాంగ్రెసు శిక్ష తప్పదన్నారు. టిడిపి మళ్లీ లేఖ ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు. కాంగ్రెసు నిర్ణయం చెప్పకుండా ఇతర పార్టీలపై తోయడం సరికాదన్నారు.












Click it and Unblock the Notifications