స్పీడ్ పెరిగితే పరలోకయానమే: వైయస్ జగన్‌పై సిఎం

విద్యార్థులు ఆదాయ, వయసు తదితర ధృవీకరణ పత్రాలు పొందేందుకు ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లకుండా ఓ కొత్త పథకం త్వరలో అమలు చేయబోతున్నామని చెప్పారు. మొదట మూడు జిల్లాల్లో ప్రయోగాత్మకంగా ప్రవేశ పెట్టి లోపాలు సరిదిద్దుకొని రాష్ట్రవ్యాప్తంగా అమలు పరుస్తామని చెప్పారు. ఈసేవా కేంద్రంలో ధృవీకరణ పత్రానికి కావాల్సిన డబ్బులు పత్రం ఇచ్చే విధంగా ఈ పథకం ఉంటుందని చెప్పారు. రేషన్ కార్డులు ఉన్న వారికి రాష్ట్రంలో ఎక్కడకు వెళ్లినా రేషన్ దొరికే విధంగా త్వరలో ప్రణాళిక తీసుకు వస్తున్నట్టు చెప్పారు.
రాష్ట్ర ప్రభుత్వం ఎసై పరీక్షలు వాయిదా వేయాలని నిర్ణయించుకుంటున్నట్లు వచ్చిన వార్తలలో ఎలాంటి నిజం లేదన్నారు. మొదట ప్రకటించిన తేదీలలోనే పరీక్షలు ఉంటాయని చెప్పారు. గుంటూరు జిల్లా ఆసుపత్రులలో మందుల కొరత లేకుండా చూస్తామని చెప్పారు. భవిష్యత్తులో ఎవరూ ఊహించని విధంగా సంక్షేమ పథకాలు రూపొందించి ప్రవేశ పెడతామని చెప్పారు. ఎస్సీ హాస్టళ్లను మూసి వేయమని చెప్పారు. తక్కువ విద్యార్థులు ఉన్న హాస్టళ్లను ఇంటిగ్రేటెడ్ హాస్టళ్లుగా మారుస్తామని చెప్పారు. మంత్రి వ్యాఖ్యలను మీడియా వక్రీకరించిందన్నారు.












Click it and Unblock the Notifications