వైయస్‌ను సిఎంగా జగన్ దించేసేవారు: లగడపాటి

Lagadapati Rajagopal
ఒంగోలు: ఒకవేళ వైయస్‌ జీవించే ఉంటే జగన్ ఆయనపై ఒత్తిడి తెచ్చి, పోరాడి ఒకటి రెండేళ్లలోనే వైయస్‌‌ను దించి తాను ముఖ్యమంత్రి పీఠం ఆక్రమించే వారని విజయవాడ కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ వ్యాఖ్యానించారు. జగన్ మనస్తత్వం ఏమిటో చిన్నప్పటి నుంచి తనకు తెలుసునని ఆయన అన్నారు. కృష్ణా జిల్లా కంచికచర్లలో మంగళవారం జరిగిన బ్లాక్ కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో లగడపాటి ప్రసంగించారు. 60 సంవత్సరాల వరకు మాత్రమే క్రియాశీల రాజకీయాల్లో ఉంటానని వైయస్‌ అప్పట్లో చెప్పారని, వైయస్‌‌కు 60 ఏళ్లు పూర్తి కాగానే ఆయనను దించేందుకు జగన్ ఒక్క క్షణం కూడా నిద్రపోకుండా పోరాడేవారని, చంద్రబాబు, జగన్ మనస్తత్వాలు ఒకటేనని లగడపాటి అన్నారు. సోనియా గాంధీ వైయస్‌‌కు ఎక్కడలేని గౌరవం ఇచ్చారని, వైయస్ సారథ్యంలో పార్టీ రెండు సార్లు ఓడినప్పటికీ సీఎల్‌పీ నాయకుడిని చేశారని గుర్తు చేశారు. వైయస్‌ పాదయాత్రలో జగన్ ఎక్కడా కనిపించ లేదని తెలిపారు.

వైయస్‌ రాజమండ్రిలో మంచాన పడినప్పుడు కనీసం పలకరించటానికి జగన్ రాలేదని, 2004 ఎన్నికల్లో గెలుస్తానన్న నమ్మకం లేనందునే జగన్ పోటీ చేయలేదని, గెలిచిన తర్వాత రాజీనామా చేయాల్సిందిగా బాబాయి వివేకానంద రెడ్డిపై తీవ్ర స్థాయిలో ఒత్తిడి తీసుకొచ్చారని, కాంగ్రెస్ పార్టీ ద్వారా జగన్ సీఎం అవుతారనుకున్నామని, కానీ పార్టీ గుండెల్లో గునపం గుచ్చుతారనుకోలేదని లగడపాటి వ్యాఖ్యానించారు. ఒకవైపు సోనియాను దారుణంగా విమర్శిస్తూ, మరోవైపు వైయస్‌ వారసుడినని చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు.

వైయస్‌‌పై అభిమానంతో జగన్ వద్దకు చేరిన వారంతా వాస్తవాలు తెలుసుకుని ఆయన మాయలో నుంచి బయటపడుతున్నారని లగడపాటి అన్నారు. జగన్‌పై సీబీఐ విచారణతో కాంగ్రెస్‌కు సంబంధం లేదని, అది మంత్రి శంకర్‌రావు వ్యక్తిగతంగా చేసిన ఫిర్యాదని ఆయన అన్నారు. కానీ, కొంత మంది కావాలని పార్టీపై బురద జల్లేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు. చట్టం తనపని తాను చేసుకుపోతుందని, సీబీఐపై ఎలాంటి ఒత్తిడీ లేదని ఆయన చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+