చిరు అల్లుడు, శ్రీజ భర్త శిరీష్ భరద్వాజ్ లొంగుబాటు

Sirish Bharadwaj
హైదరాబాద్: అదనపు వరకట్నం, వేధింపుల కేసులో తిరుపతి శాసనసభ్యుడు మెగాస్టార్ చిరంజీవి చిన్నల్లుడు శిరీష్ భరద్వాజ్ బుధవారం హైదరాబాదులోని నాంపల్లి కోర్టు ముందు లొంగిపోయాడు. శిరీష్ భరద్వాజ్‌పై ఆమె భార్య, చిరంజీవి కూతురు శ్రీజ కేసు పెట్టిన విషయం తెలిసిందే. తనను శారీరకంగా హింసించడాని శ్రీజ శిరీష్‌పై ఫిర్యాదు చేసింది. కాగా, గత మూడు నెలలుగా అజ్ఞాతంలో ఉంటూ అరెస్టు నుంచి శిరీష్ భరద్వాజ్ తప్పించుకుంటున్నారు. బుధవారం అకస్మాత్తుగా కోర్టు ముందు హాజరయ్యాడు.

తండ్రి చిరంజీవికి, కుటుంబ సభ్యులకు చెప్పకుండా శ్రీజ శిరీష్ భరద్వాజ్‌ను ప్రేమ వివాహం చేసుకుంది. అప్పట్లో ఇదో సంచలనం. వారిద్దరు చాలా కాలం కలిసే వున్నారు. వారికి ఓ సంతానం కూడా కలిగింది. అప్పటి నుంచే శ్రీజకు తన కుటుంబ సభ్యులతో సంబంధాల పునరుద్ధరణ జరుగుతూ వచ్చింది. క్రమక్రమంగా శ్రీజ భరద్వాజ్‌కు దూరమవుతూ వచ్చింది. ఆ తర్వాత శిరీష్‌తో పూర్తిగానే విడిపోయి చిరంజీవి ఇంటికి వచ్చేసింది. ఆ క్రమంలోనే శిరీష్ భరద్వాజ్‌పై శ్రీజ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

శిరీష్ భరద్వాజ్‌కు నాంపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో ఆయనను పోలీసులు హైదరాబాదులోని చంచల్‌గుడా జైలుకు తరలించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+