భార్యను వేధించిన కేసులో మైక్రోసాఫ్ట్ టెక్కీ అరెస్టు

తన భర్త ఈ నెల 20వ తేదీన ఇంట్లో తనపై భౌతిక దాడి చేశాడని నిషాం్త ఈ నెల 23వ తేదీన పోలీసులకు ఫిర్యాదు చేసింది. అతని దాడిలో ఆమె నోటికి, ఎడమచేతికి గాయాలయ్యాయి. ఈ సంఘటన జరిగినప్పుడు ఇండోర్‌లో న్యాయవాది అయిన తన మామ సిరాజ్ అక్తర్ ఖాన్, అత్త నసీమా అక్తర్ ఖాన్ ఇంట్లోనే ఉన్నారని నిషాంత్ చెప్పింది.
అదనపు కట్నం ఇవ్వనందుకే తనను వేధిస్తున్నారని ఆమె ఆరోపించింది. తన భర్త మొదటి వివాహాన్ని దాచి పెట్టి తనను మోసం చేశారని కూడా ఆమె ఆరోపించింది. ఫైజల్‌ను పోలీసులు మంగళవారం అరెస్టు చేసారు. ఇతర నిందితులను అరెస్టు చేయాల్సి ఉందని హుమాయున్ నగర్ ఇన్‌స్పెక్టర్ పి. మధుకర్ స్వామి చెప్పారు.












Click it and Unblock the Notifications