చీటింగ్ కేసులో చిత్ర నిర్మాత వరీందర్ కుమార్ అరెస్టు

ముఖ్యమంత్రి కోటాలో ఏడు ఫ్లాట్ల కేటాయింపు జరిగిందని, వాటిలో ఒకటి తనకు ఇస్తానని వరీందర్ కుమార్ చెప్పాడని, ఒప్పందం కుదుర్చుకున్న తర్వాత తాను డబ్బులు చెల్లించానని, అయితే తనకు ఒప్పందం ప్రతిని ఇవ్వలేదని, ఫ్లాట్ అడిగితే ఏవేవో కారణాలు చెప్పి తప్పించుకుంటున్నాడని సమీర్ పాండే చెప్పాడు. హితేష్ భట్, అబ్బాస్ మస్తాన్, చిత్రేష్ శ్రీవాస్తవ, అశోక్ గైక్వాడ్‌లను కూడా అతను మోసం చేశాడు. కుమారుడికి సినిమాలో అవకాశం కల్పిస్తానని బిల్డర్ మురళీలాల్ మోడీని కూడా నిరుడు మోసం చేశాడు. పోలీసుల విచారణలో కుమార్ తనపై వచ్చిన ఆరోపణలను ఖండించాడు.












Click it and Unblock the Notifications