రామ్‌దేవ్ హాట్, అంగీకరిస్తే పెళ్లాడుతా: రాఖీ సావంత్

''బాబా రాందేవ్ అంగీకరించిన రోజు నేను ఆయన్ను పెళ్లాడతా. రానున్న స్వయంవరం కార్యక్రమానికి రాందేవ్‌ను తీసుకురావాలని ఇమాజిన్ టీవీని కోరుతున్నా'' అని చెప్పింది. ''చాలా కాలం కిందట రాహుల్‌ను పెళ్లాడదామనుకున్నా, కానీ, ప్రస్తుతం రాందేవ్‌ను మాత్రమే ఇష్టపడుతున్నా'' అని రాఖీ వెల్లడించింది. రాహుల్ గాంధీ 'సగం భారతీయుడు' అన్న కత్రినా కైఫ్ వ్యాఖ్యలను విమర్శించింది. ఆమె అలా అనడం సరికాదని చెప్పింది.
యోగా గురు రామ్‌దేవ్ బాబాకు గుట్టల కొద్దీ డబ్బులు, ఖరీదైన కార్లున్నాయని, తన పెళ్లి రామ్‌దేవ్‌తో జరిగితే మీరు కొత్త రకం సాధ్వీని చూస్తారని ఆమె అన్నది. రామ్‌దేవ్‌ను బాబా అని సంబోధించడానికి ఆమె నిరాకరించింది. మీలాంటి వ్యక్తులకు ఆయన బాబా అని, తనకైతే స్వామీ అని, రామ్‌దేవ్ తనను సోదరి అని సంబోధించడని తాను నమ్ముతున్నానని రాఖీ సావంత్ అన్నది.












Click it and Unblock the Notifications