తిరుగుబాటు: యడ్యూరప్ప వెనక 30 మంది ఎమ్మెల్యేలు?

తమ ఆదేశాలను ధిక్కరిస్తే వేటు తప్పదని బిజెపి అధిష్టానం యడ్యూరప్పను కూడా ఆదేశించింది. కానీ ఆయన అధిష్టానం మాటను బేఖాతరు చేయాలనే నిర్ణయించుకున్నట్లు చెబుతున్నారు. రేపు శుక్రవారం యడ్యూరప్ప స్థానంలో కొత్త నేత ఎంపికకు బిజెపి అధిష్టానం ముహూర్తం పెట్టింది. ఈశ్వరప్ప లేదా జగదీష్ షెట్టర్‌ల్లో ఒకరిని ముఖ్యమంత్రి పదవికి ఎంపిక చేయాలని బిజెపి అధిష్టానం తొలుత నిర్ణయించింది. అయితే, అకస్మాత్తుగా సదానంద గౌడ పేరు తెర మీదికి వచ్చింది. సదానంద గౌడను ఎంపిక చేస్తే యడ్యూరప్ప వర్గంలోని శాసనసభ్యులు కొంత మంది మద్దతు పలికే అవకాశం ఉంటుందని అధిష్టానం భావిస్తోంది. కానీ, అది సాధ్యమవుతుందా అనేది అనుమానంగానే ఉంది.












Click it and Unblock the Notifications