కర్నాటక సంక్షోభానికి తెర, రాజీనామాకు యెడ్డీ సిద్ధం?

ఓ సమయంలో ఆయన అధిష్టానం మాటలు బేఖాతరు చేస్తూ రాజీనామా చేసే ప్రసక్తే లేదని ఖచ్చితంగా చెప్పారు. దీంతో చేసేది లేక అధిష్టానం యెడ్డీకి ఆల్టిమేటం జారీ చేసింది. పన్నెండు గంటలలోగా రాజీనామా చేయాలని ఆల్టిమేటం జారీ చేసింది. యెడ్డీ కూడా తన పదవిని నిలబెట్టుకోవడానికి పలువురు ఎమ్మెల్యేలు, మంత్రులతో రహస్య సమావేశం నిర్వహించారు. యెడ్డీ సమావేశానికి ఎవరూ హాజరు కావద్దని అధిష్టానం సూచించడంతో ఎక్కువ మంది నేతలు హాజరు కాలేదు. సుమారు 30 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఆయన రహస్య భేటీలో పాల్గొన్నారు. అయితే ఎట్టకేలకు యెడ్డీ రాజీనామాకు అంగీకరించడంతో పార్టీ అంతర్గత సంక్షోభానికి తెరపడింది.












Click it and Unblock the Notifications