తెలంగాణపై యనమల కామెంట్స్: చంద్రబాబు క్లాస్

కానీ ఇలాంటి వక్రీకరణలకు దిగజారవద్దని కోరారు. తెలంగాణ ప్రాంత ప్రజాప్రతినిధులు తన వ్యాఖ్యలను రాజకీయం చేయడం సరికాదన్నారు. గత మహానాడులో చేసిన తీర్మానాన్ని మాత్రమే తాను చెప్పానని అన్నారు. ఆ విషయంపై తమ అధినేతకు తాను వివరణ ఇవ్వలేదన్నారు. తాను ఇంచార్జిగా ఉన్న విజయనగరం జిల్లాపై చర్చించడానికి చంద్రబాబును కలిసినట్లు చెప్పారు. తన వ్యాఖ్యలను ఎవరూ తప్పుగా అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదన్నారు.
అనవసరంగా టిడిపిని వివాదంలోకి లాగే ప్రయత్నాలు టిఆర్ఎస్ చేస్తోందని ఆరోపించారు. కాగా ప్రత్యేక తెలంగాణ విషయంలో 2011 మహానాడులో టిడిపి చేసిన తీర్మానానికి పార్టీ కట్టుబడి ఉందని ఆయన అన్నారు. 2011 తీర్మానంలో తెలంగాణ అంశాన్ని కేంద్రానికి అప్పగిస్తూ తీర్మానం చేశారు. ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్నే లేపాయి. అయితే యనమల చంద్రబాబును కలిసి వివరణ ఇచ్చుకున్నారని, చంద్రబాబు ఆయనను మందలించారనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి.












Click it and Unblock the Notifications