వారు చంద్రబాబుకు బానిసలు: నాగం ధ్వజం

టిటిడిపి నేతలకు వెన్నెముక లేదా అని అడిగారు. తెలంగాణ అంశాన్ని నిత్యం కేంద్రంపై నెట్టడం బాబుకు సరికాదన్నారు. మొదట తన వైఖరి చెప్పిన తర్వాత కేంద్రాన్ని ప్రశ్నించాలని సూచించారు. తమ నియోజకవర్గాల్లో ఇంచార్జిలను నియమిస్తే భయపడేది లేదన్నారు. తెలంగాణలో డబ్బులతో రాజకీయం చేయలేరని హెచ్చరించారు. టిడిపి, కాంగ్రెసు ప్రజాప్రతినిధులు రాజీనామా చేయకుంటే వారికి రాజకీయ సమాధి తప్పదన్నారు. టిటిడిపి నేతల తీరు చూస్తుంటే వారికి తెలంగాణ తేవాలన్న ఆకాంక్ష ఏమీ లేనట్లుగా కనిపిస్తోందన్నారు. తెలుగు వారి ఆత్మ గౌరవం కోసం పుట్టిన టిడిపికి తెలంగాణ ప్రజల ఆత్మఘోష పట్టదా అని ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications