బెజవాడలో మూడో హత్య, భార్యపైనే అనుమానం

శవం వద్ద ఓ చున్నీ కనిపించింది. దానివల్ల యువకుడి హత్యలో మహిళ పాత్ర ఉండవచ్చునని పోలీసులు అనుమానిస్తున్నారు. లేదంటే, వైవాహికేతర సంబంధం ఈ హత్యకు కారణమై ఉండవచ్చునని అంటున్నారు. రెండు రోజుల క్రితమే ఆ యువకుడి హత్య జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. పొలంలోంచి దుర్వాసన వస్తుండడంతో కొంత మంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు వచ్చి శవాన్ని బయటకు తీశారు.
మహిళ పాత్ర ఉండవచ్చునని అనుమానించిన పోలీసులు ఆ దిశగా దర్యాప్తు సాగించారు. హత్యకు గురైన యువకుడిని కృష్ణా జిల్లా అవనిగడ్డకు చెందిన కుమార్‌గా గుర్తించారు. అతని భార్య స్వరూపను పోలీసులు విచారిస్తున్నారు. వీరిద్దరు నెలరొజుల క్రితమే పోరంకి వచ్చినట్లు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications