లోకాయుక్తపై బిజెపి నేత వెంకయ్యనాయుడు అసంతృప్తి

దీనిపై కాంగ్రెసు పార్టీ నీతిమాలిన రాజకీయాలు చేస్తోందని ఆరోపించారు. నాయకత్వ మార్పు అనేది తమ పార్టీ అంతర్గత విషయం అని చెప్పారు. ఈ నెల 31వ తారీఖున యడ్యూరప్ప రాజీనామా చేస్తారని అన్నారు. రాజీనామా చేయడం కోసం యడ్యూరప్ప కొన్ని డిమాండ్లు పెట్టారని వస్తున్న వార్తల్లో నిజం లేదన్నారు. ఆయనతో ఎలాంటి షరతులు లేకుండా రాజీనామా చేయిస్తున్నామని చెప్పారు. ఆగస్టు 1న కొత్త ప్రభుత్వం ఏర్పడుతుందని చెప్పారు. అందరి శాసనసభ్యుల అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకొని యడ్డీ వారసుడిని ఎంపిక చేస్తామని చెప్పారు. అవినీతిపై రాజీపడే ప్రసక్తి లేదన్నారు.












Click it and Unblock the Notifications