హైదరాబాద్ భవిష్యత్తుపై నీలినీడలు, పట్టని పాలకులు

గత రెండేళ్లుగా అకస్మాత్తు బంద్‌లకు, విద్యాసంస్థల బంద్‌కు అలవాటు పడిపోయిది. ఎప్పుడు ఏం జరుగుతోందనే ఆస్థిర వాతావరణం హైదరాబాదు జీవనవిధానాన్ని దెబ్బ తీస్తోంది. ప్రపంచంలోనే పేరు ప్రఖ్యాతులు వహించిన ఉస్మానియా విశ్వవిద్యాలయం ఇప్పుడు ఓపెన్ జైలులా మారింది. సాయుధ బలగాలతో, ముళ్ల కంచెలతో అది అల్లాడిపోతోంది. రియల్ ఎస్టేట్ వ్యాపారానికి స్వర్గధామంగా విలిసిల్లిన నగరం ఇప్పుడు లావాదేవీలు లేక చతికిల పడింది. పలు కార్పొరేట్ సంస్థలు, బహుళ జాతి సంస్థలు తమ కార్యాలయాలను హైదరాబాదులో నెలకొల్పడానికి గతంలో విశేష ఆసక్తిని ప్రదర్సించాయి. ఇప్పుడు వెనక్కి మళ్లే పరిస్థితి ఏర్పడింది. బెంగుళూర్, చెన్నై వంటి నగరాలకు అవి తరలిపోతున్నాయి.
హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్‌ను కోల్పోతోంది. కొన్ని ఎయిర్‌లైన్స్ విమానాల సంఖ్యను తగ్గించాయి. వాణిజ్యవేత్తలు, పర్యాటకులు తగ్గడంతో విమానాలను నడిపించడం లాభసాటిగా సాగడం లేదు. తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం నిర్ణయంలో జాప్యం జరుగుతున్న కొద్దీ హైదరాబాదు మరింతగా నష్టపోతుంది. హైదరాబాదును ఫుట్‌బాల్‌లా ఆడుకుంటున్నారు. కొందరు దాన్ని కేంద్ర పాలిత ప్రాంతంగా చేయాలని అంటుంటే, మరికొంత మంది హాంగ్‌కాంగ్‌లా సిటీ - ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని అంటున్నారు. మరి కొంత మంది ఉమ్మడి రాజధానిగా చేయాలని అడుగుతున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే హైదరాబాదు శాంతిని, ప్రగతిని, సంపదను కోల్పోతుంది.












Click it and Unblock the Notifications