6న తెలంగాణ తెలుగుదేశం ఎమ్మెల్యేల రాజీనామా

Errabelli Dayakar Rao
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆగస్టు ఆరవ తేదీన మరోసారి తెలుగుదేశం తెలంగాణ ప్రాంత శాసనసభ్యులు రాజీనామా చేసే అవకాశాలున్నాయి. పార్లమెంటులో తెలంగాణ బిల్లు ప్రతిపాదించాలని డిమాండ్ చేస్తూ ఆగస్టు 1వ తేదీన హైదరాబాదులోని ఇందిరా పార్కు వద్ద ఒక ధర్నా చేపట్టనుంది. ఈ ధర్నా కార్యక్రమంలో రాజీనామాలపై తెలుగుదేశం తెలంగాణ ప్రాంత నాయకులు ప్రకటిస్తారని అంటున్నారు. భవిష్యత్తు కార్యాచరణపై తెలుగుదేశం తెలంగాణ ఫోరం శనివారం సమావేశమై చర్చించింది. సమావేశానంతరం ఫోరం కన్వీనర్ ఎర్రబెల్లి దయాకర్ రావు మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. తాము రాజీనామాలకు వెనకాడేది లేదని, స్పీకర్ వచ్చిన తర్వాత తాము రాజీనామాలు చేస్తామని, కాంగ్రెసు శాసనసభ్యులు కూడా తమతో కలిసి రావాలని ఆయన అన్నారు.

రాజీనామాలకు కాంగ్రెసు తెలంగాణ శాసనసభ్యులను ఎలా సిద్ధం చేయాలో తమకు తెలుసునని ఆయన అన్నారు. రాజీనామాలు కలిసికట్టుగా చేసి రాజ్యాంగ సంక్షోభం సృష్టించాలని ఆయన సూచించారు. ఇందుకు అన్ని పార్టీలు కలిసి రావాలని, అన్ని పార్టీలను ఒకే వేదిక మీదిక తేవడానికి తెలంగాణ జెఎసి, ఇతర తెలంగాణ ప్రజా సంఘాలు కృషి చేయాలని ఆయన అన్నారు. అందుకు ప్రయత్నాలను ఎవరు ప్రారంభించినా తాము సహకరిస్తామని ఆయన అన్నారు. తమ భవిష్యత్తు కార్యాచరణపై ఆగస్టు ఒకటవ తేదీన ప్రకటన చేస్తామని ఆయన చెప్పారు. తెలంగాణ పార్లమెంటు సభ్యులు తమ రాజీనామాలను ఆమోదింపజేసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+