తప్పుడు ఫొటోకు చింతిస్తున్నాం, కావాలని చేసింది కాదు
State
oi-Pratapreddy
By Pratap
ఈ నెల 24వ తేదీన రాసిన వార్తాకథనంలో తప్పుడు ఫొటోను పెట్టినందుకు చింతిస్తున్నాం. 'వరుణ్ సందేశ్‌తో కలిసి డ్రగ్స్ తీసుకున్నాను: నాగసిద్ధార్థ' అనే వార్తాకథనంలో పోలీసులకు చిక్కిన డాక్టర్ సిద్ధార్థ ఫొటోకు బదులుగా హీరో సోమవరపు నాగసిద్ధార్థ ఫొటో వచ్చింది. నాగసిద్ధార్థకు మేం కలిగించిన మనోవేదనకు విచారం వ్యక్తం చేస్తున్నాం. ఇది మేం కావాలని చేసిన పొరపాటు కాదని గుర్తించాలని హీరో నాగసిద్ధార్థను కోరుతున్నాం. ఇక ముందు ఇలాంటి పొరపాటు జరగదని హామీ ఇస్తున్నాం. ఇది తెలియక చేసిన పొరపాటుగా గ్రహించగలరని ఆశిస్తున్నాం. విషయం నా దృష్టికి వచ్చిన వెంటనే ఆ ఫొటోను తీసేయడం జరిగింది.