కర్నాటక కొత్త ముఖ్యమంత్రిగా సదానంద గౌడ?

కాగా అంతకుముందు శాసనసభ్యుల అభిప్రాయం మేరకే కర్నాటక కొత్త ముఖ్యమంత్రి ఎంపిక జరుగుతుందని పార్టీ సీనియర్ నేత వెంకయ్య నాయుడు బెంగుళూరులో విలేకరులతో మాట్లాడుతూ స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి యడ్యూరప్ప రాజీనామా చేస్తానని ప్రకటించడం శుభ పరిణామం అని ఆయన అన్నారు. సాయంత్రం బిజెఎల్పీ సమావేశమై కొత్త ముఖ్యమంత్రిని ఎన్నుకునే అవకాశం ఉంది. ఈశ్వరప్ప, జగదీష్ షెట్టార్ తదితరుల పేర్లు ముఖ్యమంత్రికి పరిశీలించినప్పటికీ దాదాపు సదానంద గౌడనే వరించనుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.












Click it and Unblock the Notifications