వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జన్ లోక్‌పాల్ బిల్లుకు 85 శాతం మంది ఓటు

By Pratap
|
Google Oneindia TeluguNews

Anna Hazare
న్యూఢిల్లీ: జన్ లోక్‌పాల్ బిల్లుకు 85 శాతం మంది మద్దతు తెలుపుతున్నారని సామాజిక కార్యకర్త అన్నా హజారే టీమ్‌కు చెందిన అరవింద్ కేజ్రీవాలా చెప్పారు. కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి కపిల్ సిబాల్ లోకసభ నియోజకవర్గం చాందినీ చౌక్‌లో జరిపిన ప్రజాభిప్రాయ సేకరణ ఫలితాలను ఆయన సోమవారం విడుదల చేశారు. పార్లమెంటులోని సభ్యుల ప్రవర్తనపై దర్యాప్తు చేసే అధికారం లోక్‌పాల్‌కు ఉండాలని 88 శాతం అభిప్రాయపడినట్లు ఆయన తెలిపారు. ప్రధానిని లోక్‌పాల్ పరిధిలోకి తేవాలని 82 శాతం మంది, న్యాయవ్యవస్థను తేవాలని 86 శాతం మంది అభిప్రాయపడినట్లు ఆయన తెలిపారు. లోక్‌పాల్ పరిధిలోకి ప్రధానిని తేవద్దని కేవలం 6 శాతం మంది మాత్రమే అభిప్రాయపడినట్లు ఆయన తెలిపారు.

కపిల్ సిబాల్ నియోజకవర్గంలోని ప్రజలు ఏం కోరుకుంటున్నారనే విషయంపై ఓ బహిరంగ సభ నిర్వహిస్తామని ఆయన చెప్పారు. నియోజకవర్గంలోని అన్ని వార్డుల్లో ఇండియా అగైనెస్ట్ కరప్షన్ ఇన్షియేటివ్ కేంద్రాలను తెరిచింది. అంతేకాకుండా ప్రతి ఇంట్లో ఫారాలను వదిలిపెట్టి, వాటిని నింపిన తర్వాత తిరిగి జమ చేసింది. కంప్యూటర్ల ద్వారా వాటి వివరాలను క్రోడీకరించారు. అమరావతి, నాగపూర్, వార్ధా, మంబై ఫలితాలను కూడా వెల్లడించారు. బెంగుళూర్, చెన్నై ఫలితాలను రేపు వెల్లడిస్తారు.

English summary
Announcing the results of the "referendum" on Lokpal Bill conducted in capital's Chandni Chowk, the Lok Sabha constituency from where HRD Minister Kapil Sibal was elected, Team Anna said that 85% of those who cast their vote have supported the Jan Lokpal Bill.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X