కర్ణాటక ముఖ్యమంత్రి ఎంపికలో వీడని చిక్కులు

అనంతకుమార్‌తో పాటు బిజెపి రాష్ట్రాధ్యక్షుడు ఈశ్వరప్ప కూడా సదానంద గౌడను వ్యతిరేకిస్తున్నారు. మంత్రి జగదీష్ షెట్టర్ తాను ముఖ్యమంత్రి పదవికి రేసులో ఉన్నానని ప్రకటించారు. తనకు 56 మంది శాసనసభ్యుల మద్దతు ఉందని, అది 69కి పెరుగుతుందని ఆయన చెబుతున్నారు. యడ్యూరప్ప మాదిరిగానే జగదీష్ షెట్టర్ బలమైన లింగాయత్ వర్గానికి చెందినవారు. అయితే, ఆయనను యడ్యూరప్ప వ్యతిరేకిస్తున్నారు. రెండు వర్గాలు తీవ్రంగా పోటీ పడుతున్న తరుణంలో మధ్యేమార్గంగా ఆచార్య పేరు ముందుకు వస్తోంది. కాగా, ఏకాభిప్రాయ సాధన ద్వారా గానీ రహస్య బ్యాలెట్ ద్వారా గానీ శాసనసభా పక్ష నేతను ఎంపిక చేసే విషయంపై ఆలోచన చేస్తున్నట్లు రాజ్‌నాథ్ సింగ్ చెప్పారు.












Click it and Unblock the Notifications