అజ్ఞాతంలోకి ఎందుకెళ్లాడో తెలియదు: చమన్ భార్య

రాజకీయాల్లో ఉన్నారు కాబట్టి ఏమైనా సమస్యలు ఎదురవుతాయని అనుకుని పరిటాల రవి హత్య తర్వాత అజ్ఞాతంలోకి వెళ్లి ఉంటారని ఆమె అన్నారు. చమన్ ఆరోగ్యం బాగా లేదని అంటున్నారని, తాను హైదరాబాదు బయలుదేరుతున్నానని ఆమె చెప్పారు. చమన్ రాజకీయాలకు దూరంగా ఉండాలని తాను కోరుకుంటున్నట్లు ఆమె చెప్పారు. పరిటాల అనుచరుడు, పలు కేసుల్లో నిందితుడు చమన్ మంగళవారం డిజిపి దినేష్ రెడ్డి ముందు పోలీసులకు లొంగిపోయిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications