తెలంగాణ టీచర్లకు చంద్రబాబు నాయుడు హామీ

తమ సంఘీభావ దీక్షకు మద్దతు ఇవ్వాలని చంద్రబాబును కోరామని అందుకు ఆయన సానుకూలంగా స్పందించారని చెప్పారు. టిడిపి తరఫున ఒక ప్రతినిధిని పంపిస్తానని చెప్పారని అన్నారు. బుధవారం ఉదయం 10 గంటలకు దీక్ష ప్రారంభమై సాయంత్రం 5 గంటలకు ముగుస్తుందని చెప్పారు. తమ దీక్షకు తెలంగాణకు చెందిన అన్ని జెఏసి నాయకులను ఆహ్వానించామని అన్నారు. కేంద్రం తెలంగాణపై ఇప్పటికే చాలా ఆలస్యం చేసిందని అన్నారు. వెంటనే తెలంగాణపై స్పష్టమైన ప్రకటన చేయాలని కోరారు.












Click it and Unblock the Notifications