చిరంజీవి ఇమేజ్‌ను మీడియా దెబ్బ తీస్తోందా?

కాగా, చిరంజీవిని కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ ఫోన్ చేసి ఢిల్లీకి ఆహ్వానించారు. కాంగ్రెసులో ప్రజారాజ్యం పార్టీ విలీన ప్రక్రియను పూర్తి చేయడానికి ఆమె చిరంజీవిని ఢిల్లీకి ఆహ్వానించారు. ఈ నెల 7 నుంచి 10 తేదీల మధ్య ఎప్పుడైనా ఢిల్లీ రావాలని ఆమె సూచించారు. తేదీని ఖరారు చేసి పార్టీ ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ గులాం నబీ ఆజాద్‌కు తెలియజేయాలని ఆమె సూచించారు.
ఢిల్లీ పర్యటనలో చిరంజీవి లాంఛనంగా కాంగ్రెసు పార్టీ సభ్యత్వం తీసుకుంటారు. ప్రజారాజ్యం పార్టీ శానససభ్యులు హైదరాబాదు గాంధీ భవన్‌లో కాంగ్రెసు సభ్యత్వం తీసుకుంటారు. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా విలీన సభ ఉండదని రామచంద్రయ్య చెప్పారు.












Click it and Unblock the Notifications