కొత్త ముఖ్యమంత్రి ఎన్నిక ఏకగ్రీవమే: యడ్యూరప్ప

కాగా మంగళవారం సాయంత్రం బిజెపి సీనియర్ నేత, మాజీ మంత్రి అరుణ్ జైట్లీ బెంగళూరు రానున్నారు. బుధవారం జరిగే బిజెఎల్పీ సమావేశంలో కొత్త ముఖ్యమంత్రిని ఎన్నుకుంటారు. యడ్యూరప్ప పట్టు మేరకు పార్లమెంటు సభ్యుడు సదానంద గౌడ పేరు దాదాపు ఖరారయినట్లుగా తెలుస్తోంది. సదానంద గౌడ వివాద రహితుడు కావడం, అందరితో కలుపుకు పోయే వ్యక్తి కావడం వలన బిజెపి యడ్యూరప్ప డిమాండుకు తలొగ్గినట్లుగా తెలుస్తోంది. యడ్యూరప్ప వ్యతిరేక వర్గం జగదీష్ షెట్టార్, అనంత కుమార్‌ల నుండి ఏమైనా ఒత్తిళ్లు ఎదురైతే ఉపముఖ్యమంత్రి పీఠంపై కూర్చుండ బెట్టాలని చూస్తున్నట్లుగా సమాచారం.












Click it and Unblock the Notifications