హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తెలంగాణ వ్యతిరేకులకు సేవలు బంద్: కోదండరామ్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Kodandaram
హైదరాబాద్: తెలంగాణ వ్యతిరేకులకు, తెలంగాణేతరులకు సేవలు బందు చేస్తామని తెలంగాణ ఐక్య కార్యాచరణ సమితి చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ బుధవారం అన్నారు. తెలంగాణ ఉపాధ్యాయ సంఘాల ఒక్కరోజు దీక్షకు సంఘీభావం తెలపడానికి వెళ్లి కోదండరామ్ ఉపాధ్యాయులను ఉద్దేశించి మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం సాధించుకోవడానికి ప్రజలంతా ఏకమైనారని అన్నారు. యావత్తు తెలంగాణ ప్రజల ఐక్యతే ఉద్యమానికి వారధి అని అన్నారు. తెలంగాణ ప్రజలు, ప్రజా ప్రతినిధుల మధ్య అగాధం సృష్టించడానికి సీమాంధ్ర నేతలు ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ ప్రజా ప్రతినిధులు మరోసారి రాజీనామాలు చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ నెల 17 నుండి తెలంగాణ ప్రజలు అందరూ రహదారుల పైకి రావాలని పిలుపునిచ్చారు.

తెలంగాణ ప్రజల జై తెలంగాణ నినాదాలు ఢిల్లీ పెద్దలకు వినిపించాలన్నారు. సకల జనుల సమ్మె అంటే కేవలం ఉద్యోగుల సమ్మె కాదన్నారు. తెలంగాణ ప్రజలు అందరూ పాలనకు సహకరించాలన్నారు. తెలంగాణ ప్రజలంతా సమ్మెలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. కేంద్రంపై ఒత్తిడి తీసుకు రావడం కోసమే సకల జనుల సమ్మె చేస్తున్నట్లు చెప్పారు. సహాయ నిరాకరణ కేవలం తెలంగాణ వ్యతిరేకులకే అని చెప్పారు. ప్రయివేటు స్కూళ్లు కూడా సమ్మెలో పాల్గొంటాయని చెప్పారు. సమ్మెలో ఉపాధ్యాయులు కీలక పాత్ర పోషించాలని సూచించారు. కాగా అంతకుముందు ఎమ్మెల్సీ చుక్కా రామయ్య, టిడిపి నేత ఎర్రబెల్లి దయాకర రావుకు చుక్కెదురయింది.

English summary
Telangana Joint Action Committee chairman pro. Kodandaram demanded Telangana political leaders resignations again. He clarified on Sakala Jana Same to employees.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X