సమైక్యాంధ్రకే జగన్: శ్రీకాంత్ రెడ్డి ప్రకటనతో స్పష్టం

YS Jagan
హైదరాబాద్: వైయస్సాఆర్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి సమైక్యాంధ్రకే మొగ్గు చూపిస్తాడని ఆయన వర్గం కాంగ్రెసు పార్టీ శాసనసభ్యుడు శ్రీకాంత్ రెడ్డి వ్యాఖ్యల ద్వారా అర్థమవుతోంది. ఇన్నాళ్లూ తెలంగాణకు పూర్తి వ్యతిరేకంగా మాట్లాడిన విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ మంగళవారం ఒక్కసారిగా మరిన్ని రాష్ట్రాల డిమాండ్లు రాని నేపథ్యంలో తాను తెలంగాణపై ఆలోచిస్తానని చెప్పారు. ఈ విషయంపై శ్రీకాంత్ రెడ్డి బుధవారం తీవ్రంగా మండిపడ్డారు. తెలంగాణకు ఓకే అని చెప్పడానికి లగడపాటి ఎవరని ప్రశ్నించారు.

తాము సమైక్యాంధ్రకే కట్టుబడి ఉన్నామని చెప్పారు. సీమాంధ్ర ఉద్యమానికి తాను లీడర్‌నని భావిస్తున్నందు వల్లే లగడపాటి అలా వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు. తెలంగాణపై లగడపాటి వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు చెప్పారు. తాము సమైక్యాంధ్ర కోసం ప్రధాని మన్మోహన్ సింగ్, కేంద్ర మంత్రి ప్రణబ్ ముఖర్జీని కలిశామని అన్నారు. జగన్‌పై రాజకీయ పార్టీలు కక్ష కట్టాయని అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+