సోనియాకు అమెరికాలోని క్యాన్సర్ సెంటర్‌లో శస్త్ర చికిత్స

సోనియా కుటుంబ వైద్యుడు ఘాయ్ భండారీ సమక్షంలో సోనియాకు వైద్య పరీక్షలు, శస్త్ర చికిత్స చేసినట్లు వార్తలు వచ్చాయి. కాగా, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ప్రముఖ వైద్యుడు నోరి దత్తాత్రేయుడు సోనియా శస్త్ర చికిత్సను పర్యవేక్షిస్తున్నట్లు కూడా తెలుగు టీవీ చానెళ్లు వార్తలను ప్రసారం చేశాయి. ఈ వార్తలు బయటకు రావడంతో సోనియా నివాసం టెన్ జన్‌పథ్ వద్ద కార్యకర్తల సందడి మొదలైంది. కార్యకర్తలు తీవ్రమైన ఆందోళన వ్యక్తం చేస్తున్నారు
గురువారం ఉదయం పార్టీ అధికార ప్రతినిధి జనార్దన్ ద్వివేది కొద్ది సమయంలోనే రెండు విభిన్నమైన ప్రకటనలు చేశారు. సోనియాకు శస్త్రచికిత్స జరిగిందని చెప్పిన ఆయన ఆ తర్వాత ఇంకా శస్త్ర చికిత్స జరగలేదని, వైద్యులు పరీక్షిస్తున్నారని చెప్పారు. న్యూయార్క్‌లోని మెమోరియల్ స్లోన్ - కెట్టరింగ్ క్యాన్సర్ సెంటర్‌లో సోనియా గురువారం చేరారని తెహెల్కా న్యూస్ మ్యాగజైన్ మెక్రోబ్లాగింగ్ సైట్ ట్విట్టర్‌లో రాసింది.












Click it and Unblock the Notifications