తెలంగాణపై సుష్మా స్వరాజ్‌కు సర్వే మద్దతు

తెలుగుదేశం పార్టీ బహిష్కృత నేత నాగం జనార్దన్ రెడ్డి, బిజెపి చీఫ్ కిషన్ రెడ్డితో పాటు పలువురు కాంగ్రెసు పార్టీకి చెందిన తెలంగాణవాదులు సైతం బిజెపి వైఖరిని నిరసించినప్పటికీ సుష్మా స్వరాజ్ తెలంగాణపై మాట్లాడటంపై సానుకూలంగా స్పందించారు. సుష్మా స్వరాజ్ మాట్లాడుతున్నప్పుడు సీమాంధ్ర నేతలు నిరసనలు తెలిపిన సమయంలో సాక్ష్యాత్తూ కాంగ్రెసు ఎంపీ సర్వే సత్యనారాయణ ఆమెకు మద్దతుగా నిలిచారు. ఇక సోదర, సోదరీమణులారా తెలంగాణ కోసం బలిదానం వద్దు... తెలంగాణ కోసం బతకండి అని ఆమె తెలుగులో వ్యాఖ్యలు చేసిన సందర్భంలో అందరూ బల్లలు చరిచి అభినందించారు.












Click it and Unblock the Notifications