తెలంగాణ రాదనే కెసిఆర్ రాద్దాంతమా?: గోనె ఫైర్

Gone Prakash Rao
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావుపై వైయస్సాఆర్ కాంగ్రెసు పార్టీ నేత గోనె ప్రకాశ రావు ఆదివారం తీవ్రస్థాయిలో విరుచుకు పడ్డారు. గోనె ప్రకాశ రావు ఆదివారం అసెంబ్లీ మీడియా పాయింటు వద్ద మాట్లాడారు. స్వార్థం కోసం తెలంగాణ వాదాన్ని వాడుకోవద్దని కెసిఆర్‌కు, తెలంగాణ రాజకీయ ఐక్య కార్యాచరణ సమితి చైర్మన్ కోదండరామ్‌కు సూచించారు. తెలంగాణపై బంతాట ఆడటం మానుకోవాలన్నారు.

2014 వరకు తెలంగాణ రాదని తెలిసే కెసిఆర్ తెలంగాణపై ఇంత రాద్దాంతం చేస్తున్నారా అని ప్రశ్నించారు. తెలంగాణ రాదని తెలిసి ఇలా రెచ్చగొట్టడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు. తెలంగాణపై కెసిఆర్, జెఏసి వ్యూహం ఏమిటో ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉందని డిమాండ్ చేశారు. తెలంగాణలోని ఎస్సీ, ఎస్టీలను, విద్యార్థులను మీరు ఏం చేయదల్చుకున్నారని ప్రశ్నించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+