వైయస్ జగన్ జైలుకు వెళ్తారా?: ఓ డైలీ కథనం

YS Jagan
హైదరాబాద్‌: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ జైలుకు వెళ్తారా అంటూ ఓ తెలుగు దినపత్రిక భారీ వార్తాకథనాన్ని ప్రచురించింది. డిఎంకెకు చెందిన కనిమొళి, రాజాల మాదిరిగానే జగన్ జైలులో కొవ్వొత్తులు తయారు చేసుకోక తప్పదా వంటి పలు ప్రశ్నలు సంధిస్తూ తెలుగు దినపత్రిక సోమవారం ఓ వార్తా కథనాన్ని ప్రచురించింది. జైలుకు వెళ్లి తల్లి విజయమ్మతో పార్టీని నడిపించాలని, జైలు - తల్లి సెంటిమెంట్లను జిమిలిగా ప్రయోగించాలని జగన్ వ్యూహం పన్నారని రాసింది. పార్లమెంటు సభ్యుడు మేకపాటి రాజమోహన్ రెడ్డి, మాజీ మంత్రి మూలింటి మారెప్ప వంటి నాయకులు చేసిన వ్యాఖ్యలు ఈ విషయాన్ని తెలియజేస్తున్నాయంటూ వ్యాఖ్యానించింది.

జగన్ అక్రమాస్తుల కేసులో ప్రాథమిక సాక్ష్యాధారాలు ఉన్నాయంటూ తనను అరెస్టు చేసి జైలుకు పంపుతారని కూడా జగన్ అనుకుంటున్నారట. ఆయన అందుకు మానసికంగా సిద్ధమయ్యారని కూడా ఆ పత్రిక రాసింది. భవిష్యత్తులో జగన్ దాన్ని సానుభూతిగా మలుచుకుంటారని వ్యాఖ్యానించింది. జగన్ అరెస్టు కావాలనే వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు కోరుకుంటున్నట్లు కూడా ఆ పత్రిక రాసింది. అయితే, జగన్ వెంట నడుస్తున్న కొంత మంది మాత్రం పునరాలోచనలో పడినట్లు ఆ పత్రిక రాసింది. జగన్ వెంట నడుస్తున్నందుకు తాము చింతిస్తున్నట్లు కొంత మంది నాయకులు చెప్పినట్లు ముక్తాయింపు ఇచ్చింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+