హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తెలంగాణ రాదని నమ్ముతున్న చంద్రబాబు

By Pratap
|
Google Oneindia TeluguNews

Chandrababu Naidu
హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు సాధ్యం కాదని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు నమ్ముతున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెసు పార్టీ అధిష్టానం పెద్దలు మాట్లాడుతున్న తీరు, కేంద్ర హోం మంత్రి పి. చిదంబరం మాటలు ఆయనకు ఆ నమ్మకాన్ని కలిగించినట్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు చేసిన ప్రకటన ఆయన నమ్మకాన్ని మరింత పెంచినట్లు సమాచారం. ఇప్పుడు కాకపోతే 2014లో కాంగ్రెసు దొరకదా అని కెసిఆర్ అన్నారు. దీంతో జాగ్రత్తగా వ్యవహరించాలని తన పార్టీ తెలంగాణ నాయకులకు ఆయన హితవు చెప్పారని తెలుస్తోంది.

కాంగ్రెసు పార్టీ తెలంగాణ నాయకుల అడుగులను పరిశీలించి ముందుకు సాగాలని, తెలంగాణ విషయంలో కాంగ్రెసు తెలంగాణ ప్రాంత నాయకులను అనుసరించాలని, తొందరపడి ముందడుగు వేయవద్దని ఆయన తెలంగాణ ప్రాంత నాయకులకు సూచించినట్లు చెబుతున్నారు. రాజీనామాల విషయంలో కూడా కాంగ్రెసు తెలంగాణ ప్రజాప్రతినిధుల వైఖరిని బట్టి నడుచుకోవాలని ఆయన చెప్పారని అంటున్నారు. చంద్రబాబు సూచన మేరకే ఈ నెల 6వ తేదీన రాజీనామాలు చేయడానికి సిద్ధమైన తెలంగాణ శాసనసభ్యులు వెనక్కి తగ్గారని సమాచారం.

తెలంగాణ రాష్ట్ర సాధన కాకుండా తెలంగాణలో పార్టీని కాపాడుకోవడమే ధ్యేయంగా పని చేయాలని చంద్రబాబు తెలంగాణ నాయకులకు చెబుతున్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనకు తాము అన్ని త్యాగాలు చేస్తున్నామని ప్రజలను నమ్మిస్తూ ముందుకు సాగడం తప్ప మరో మార్గం లేదని చంద్రబాబు అనుకుంటున్నట్లు చెబుతున్నారు. అవసరమైతే పార్టీని కూడా వీడుతామని తెలుగుదేశం తెలంగాణ ఫోరం కన్వీనర్ ఎర్రబెల్లి దయాకర్ రావు చేసిన ప్రకటన కేవలం కాంగ్రెసుపై ఆధిక్యత సాధించడానికి మాత్రమేనని కూడా ప్రచారం జరుగుతోంది.

English summary
It is said that TDP president N Chandrababu naidu is in a notion that statehood for Telangana is not possible.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X