గాలి సోదరులకు కొత్త సిఎం సదానంద షాక్

అయితే కళంకిత మంత్రులకు అని చెప్పినప్పటికీ ఇటీవల కొత్త ముఖ్యమంత్రి ఎన్నిక సమయంలో చివరి నిమిషంలో తనకు వ్యతిరేకంగా ఓటు వేసినందునే మంత్రివర్గంలోకి తీసుకోవడం లేదని పలువురి అభిప్రాయం. అంతేకాకుండా యడ్యూరప్పతో పాటు గాలి సోదరులపైనా లోకాయుక్త అవినీతి ఆరోపణలు చేస్తూ నివేదిక ఇచ్చిన సమయంలో వారిని తీసుకోక పోవడమే మంచిదని సదానంద భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఇటీవల యడ్యూరప్పకు చివరి వరకు మద్దతు పలికిన గాలి సోదరులు ఆఖరి నిమిషంలో యడ్డీకి, సదానందకు షాక్ ఇస్తూ జగదీష్ షెట్టార్‌కు ఓటు వేసిన విషయం తెలిసిందే. ఈ విషయంపై యడ్డీ వర్గాల్లో తీవ్ర ఆగ్రహం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇందుకు యడ్డీ సైతం సదానందకు మద్దతు పలికి ఉంటారనేది పలువురి అనుమానం.












Click it and Unblock the Notifications